లాక్‌డౌన్‌లో వెడ్‌ లాక్‌

28 Sep, 2020 01:18 IST|Sakshi
డేవ్‌ మెక్యారీ, ఎమ్మా స్టోన్‌

‘క్రేజీ స్టుపిడ్‌ లవ్, అమేజింగ్‌ స్పెడర్‌ మేన్, లా లా ల్యాండ్‌’ వంటి చిత్రాలతో పాపులారిటీ సంపాదించిన హాలీవుడ్‌ నటి ఎమ్మా స్టోన్‌. మూడేళ్లుగా నటుడు, రచయిత డేవ్‌ మెక్యారీ, ఎమ్మా  డేటింగ్‌ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ లాక్‌డౌన్‌ వల్ల గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకున్నారనే  వార్త ఈ మధ్య ప్రచారంలోకొచ్చింది. దానికి కారణం ఈ జంట మ్యాచింగ్‌ రింగులు ధరించి కనిపించడమే. ప్రచారంలోకొచ్చిన వార్త నిజమే. ఈ ఇద్దరూ లాక్‌డౌన్‌లో వెడ్‌లాక్‌లోకి ఎంటరయ్యారు.

మరిన్ని వార్తలు