భవిష్యత్తులో మరిన్ని ఘనతలు అందుకోవాలి.. చిరు ఎమోషనల్ ట్వీట్

28 Sep, 2022 16:17 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌పై తన ప్రేమను చాటుకున్నారు.  నటుడిగా కెరీర్ ప్రారంభించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర‍్భంగా చిరు ఎమోషనల్ అయ్యారు. చిరుతతో మొదలై మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వరకు చరణ్ ప్రస్థానాన్ని మెగాస్టార్ కొనియాడారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్‌తో సినిమా చేసే స్థాయికి ఎదిగాడని చిరు ఆనందం వ్యక్తం చేశారు. 

(చదవండి: గాడ్ ఫాదర్ మరో సాంగ్ అవుట్.. అభిమానులకు గూస్‌బంప్స్‌ ఖాయం)

'తన వర్క్, డెడికేషన్ అన్నీ చూసి ఎంతో గర్విస్తున్నా. భవిష్యత్తులో రామ్ చరణ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలి. నిన్ను చూసి గర్విస్తున్నా. నువ్వు సాధించాల్సివి ఇంకా ఉన్నాయి. వాటి కోసం ముందుకెళ్లు.' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ పదిహేనేళ్ల సినీ ప్రస్థానంపై మెగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇవాళ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 

మరిన్ని వార్తలు