రూ.12 కోట్ల లగ్జరీ కారు కొనుగోలు చేసిన నటుడు..!

12 Jan, 2024 13:35 IST|Sakshi

ఖరీదైన కార్లను కొనుగోలు చేయడంలో సినీ తారలు ఎప్పుడు ముందుంటారు. తమకిష్టమైన కొత్త కొత్త బ్రాండ్‌ కార్లను కోట్ల రూపాయలతో కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత విలాసవంతమైన కార్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా లగ్జరీ కార్లలో రోల్స్ రాయిస్ బ్రాండ్‌ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. సెలబ్రిటీలు ఎక్కువగా అలాంటి కార్లను కొనేందుకే ఇంట్రస్ట్ చూపిస్తారు. తాజాగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ సరి కొత్త రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశాడు.

ఇటీవలే టైగర్ 3లో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించిన ఇమ్రాన్ హష్మీ విలాసవంతమైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ మోడల్‌ కారును కొనేశారు. ఈ లగ్జరీ బ్రాండ్ కారు విలువ దాదాపు  రూ.12 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇమ్రాన్‌ తన బ్లాక్ కలర్ రోల్స్ రాయిస్ కారులో రైడ్‌ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించినఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. గతంలో పఠాన్ సక్సెస్ తర్వాత షారుక్‌ ఖాన్‌ సైతం రోల్స్ రాయిస్ కారును కూడా కొనుగోలు చేశాడు.

కాగా..ఇమ్రాన్ హష్మీ చివరిసారిగా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన టైగర్-3లో కనిపించారు. ఈ చిత్రంలో విలన్‌గా మెప్పించారు. ఈ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధించింది. సెల్ఫీలో అక్షయ్ కుమార్‌తో పాటు ప్రధాన పాత్ర పోషించాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ప్రస్తుతం ఇమ్రాన్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియాంక అరుణ్ మోహన్, అర్జున్ దాస్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

>
మరిన్ని వార్తలు