టీజర్‌ బాగుంది

27 Oct, 2022 06:30 IST|Sakshi
జస్వంత్, తలసాని, సందీప్‌

– మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

‘‘తెలుగు చిత్ర పరిశ్రమకి యువతరం రావాల్సిన అవసరం ఉంది. కొత్త తరాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘ఎర్రర్‌ 500’ టీజర్‌ బాగుంది. యూనిట్‌ ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. జస్వంత్‌ పడాల, నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రల్లో సందీప్‌ మైత్రేయ ఎన్‌. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎర్రర్‌ 500’.

యు. బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్‌) నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విడుదల చేశారు. జస్వంత్‌ మాట్లాడుతూ– ‘‘ఎర్రర్‌ 500’ అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ. నన్ను హీరోగా పరిచయం చేసిన బాలరెడ్డిగారికి థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ‘బిగ్‌ బాస్‌’ ఫేం జస్వంత్‌ని హీరోగా లాంచ్‌ చేయడం ఆనందంగా ఉంది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు సందీప్‌. ఈ చిత్రానికి కెమెరా: శశాంక్‌ శ్రీరామ్‌– ప్రశాంత్‌ మన్నె, సంగీతం: ఫణి కల్యాణ్‌. 

మరిన్ని వార్తలు