Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మలుపులు

21 Sep, 2021 12:03 IST|Sakshi

డ్రగ్స్‌ విషయమై వరుసగా టాలీవుడ్‌ ప్రముఖులను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. డ్రగ్‌ డీలర్‌ కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో ఈడీ విచారణ జరుగుతుండగా సినీ తారలపై ఎక్సైజ్‌ శాఖ వరుస ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేసింది. కెల్విన్‌తో సెలబ్రిటీలకి ఉన్న సంబంధాలపై విచారించింది.

తాజాగా సినీ ప్రముఖులకు అతనితో సంబంధం ఉన్నట్లు బలమైన ఆధారాలు లేవని,  నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్‌ వాగ్మూలం సరిపోదని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. ఎక్సైజ్‌ శాఖ, ఎఫ్‌ఎస్‌ఎల్‌ డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్‌ నటులకు క్లీన్‌చిట్‌ ఇచ్చాయి. కాగా, 2017 జూలై 2న డ్రగ్స్‌ కేసులో కెల్విన్‌ అరెస్టు అయ్యాడు. అతని సమాచారం మేరకు మొత్తం 66 మందిని విచారించిన ఎక్సెజ్‌సిట్‌, ముగ్గురు మాత్రమే నిందితులని పేర్కొంది. అయితే ఇటీవల డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, నటుడు తరుణ్‌ స్వచ్ఛందంగా శాంపిల్స్‌ ఇవ్వగా, వాటిలో డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్‌  సైన్స్‌ ల్యాబ్‌(ఎఫ్ఎస్‌ఎల్‌) చెప్పింది.

చదవండి: డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరికి క్లీన్‌చిట్‌

మరిన్ని వార్తలు