Jacqueline Fernandez: రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసు.. మరోసారి జాక్వెలిన్‌కు సమన్లు

19 Sep, 2022 08:31 IST|Sakshi

న్యూఢిల్లీ:  రూ.200 కోట్ల వసూళ్ల కేసుతోపాటు మనీ లాండరింగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసు శాఖ ఆర్థికనేరాల విభాగం అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

ప్రముఖ వ్యక్తులను మోసగించి, రూ.200 కోట్లు దండుకుంటున్నట్లు ఆరోపణలున్న సుఖేశ్‌ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకదశలో సుఖేశ్‌ను పెళ్లి చేసుకోవాలని జాక్వెలిన్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు