డిస్ట్రిబ్యూటర్స్‌ హ్యాపీగా ఉన్నారు, అదే సంతోషం: వరుణ్‌ తేజ్‌

14 Jun, 2022 05:58 IST|Sakshi

– ‘దిల్‌’ రాజు

‘‘ఎఫ్‌ 3’లో వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉంది. స్టార్స్‌తో ‘దిల్‌’ రాజు తీసిన ‘ఎఫ్‌ 3’ పాన్‌ ఇండియా సినిమా కింద లెక్క. ఓ హీరోకి రేచీకటి, మరో హీరోకి నత్తి, హీరోయిన్స్‌కు డబ్బు పిచ్చి. ‘ఎఫ్‌ 3’లో ఇలాంటివి పెట్టి సినిమాను హిట్‌ చేయడం అనిల్‌కే సాధ్యం’’ అన్నారు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎఫ్‌ 3’. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం మే 27న విడుదలైంది.

సోమవారం జరిగిన ఈ సినిమా ట్రిపుల్‌ బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాఘవేంద్రరావు. ‘‘డిస్ట్రిబ్యూటర్స్‌ హ్యాపీగా ఉండటం కంటే మించిన ఆనందం ఓ యాక్టర్‌కు ఏదీ ఉండదు’’ అన్నారు వరుణ్‌ తేజ్‌. ‘‘సక్సెస్‌ అంటే ఈ కరోనా పరిస్థితుల్లోనూ మూడో వారంలో ఇంకా రెవెన్యూ రావడమే. సక్సెస్‌ అంటే ఇదే. ‘ఎఫ్‌ 3’కి అందరూ హ్యాపీ’’ అన్నారు. ‘‘ఇప్పుడు సినిమాకి ప్యారలల్‌గా ఓటీటీ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ‘ఎఫ్‌ 3’ని ఆదరిస్తున్నారంటే ఇది రియల్‌ సక్సెస్‌’’ అన్నారు అనిల్‌ రావిపూడి. డిస్ట్రిబ్యూటర్స్‌కి షీల్డ్స్‌ ప్రదానం చేశారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు