Fact Check: ఈ వీడియోలో ఉన్నది నిజంగా సిద్ధార్థ్ శుక్లానా?

3 Sep, 2021 12:54 IST|Sakshi

సాక్షి,ముంబై: నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణంతో బాలీవుడ్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన యుక్త వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. సిద్దార్థ్‌ అకాల మృతిని స్నేహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ఫిట్‌గా, ఉల్లాసంగా కనిపించే వ్యక్తి ఇలా ఆకస్మికంగా చనిపోవడంతో బీటౌన్‌ ఇండస్ట్రీ దిగ్బ్రాంతిలో మునిగిపోయింది.

కాగా జిమ్‌లో వర్కవుట్‌ చేసిన అనంతరం మెట్లు ఎక్కుతుండగా సిద్ధార్థ్‌ గుండెపోటుతో కుప్పకూలినట్లు సీసీటీవీ రికార్డు అయిందని ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సిద్ధార్థ్ శుక్లా చివరి వీడియో ఇదేనంటూ కొందరు ఈ వీడియోను తెగ  తెగ షేర్‌ చేస్తున్నారు.  కోవిడ్‌ వ్యాక్సిన్‌ అనంతరం జిమ్‌ చేసినందుకు సడెన్‌ స్ట్రోక్‌ వచ్చి కుప్పకూలిపోయినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత? ఈ వీడియోలో ఉన్నది సిద్ధార్థ్ శుక్లానా? లేక మరెవరైనానా అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇండియా టుడే యాంటీ ఫేక్‌ న్యూక్‌ వార్‌ రూం(AFWA)చేసిన ఫ్యాక్ట్‌ చెక్‌లో తెలిసిందేమిటంటే ఇది ముంబైలో జరిగింది కాదు. బెంగుళూరులోని ఓ జిమ్‌లో వర్కవుట్స్‌ అనంతరం ఓ వ్యక్తి మెట్లు ఎక్కుతూ కుప్పకూలిపోయాడు. గుండెపోటు కారణంగా ఆయన అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. బెంగుళూరు బనశంకరి పోలీసులు సైతం ఈ విషయాన్ని దృవీకరించారు. వీడియోను జాగ్రత్తగా పరిశీలించగా ఇది ఆగస్టు25న రికార్డు అయిన దృశ్యాలుగా వీడియోలో స్పష్టమవుతుంది. దీన్ని బట్టి ఈ వీడియోలో ఉన్నది సిద్ధార్థ్ శుక్లా అంటూ వైరల్‌ అవుతున్న వార్త ఫేక్‌ న్యూస్‌ అని తేలిపోయింది. 


చదవండి : సిద్ధార్థ్‌ శుక్లా మరణవార్త విని కుప్పకూలిన ప్రేయసి షెహనాజ్‌
తల్లి అంటే సిద్దార్థ్‌కు పంచప్రాణాలు.. మరణానికి ముందు కూడా..

>
మరిన్ని వార్తలు