బాలీవుడ్‌ నటి సీక్రెట్‌ ఎంగేజ్‌మెంట్‌! నిజమేనా?

14 Apr, 2021 18:23 IST|Sakshi

బాలీవుడ్‌ నటి మలైకా అరోరా, యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. కొన్నాళ్లుగా ప్రేమపాటలు పాడుకుంటున్న ఈ జంట ఉగాది పండగ రోజు సీక్రెజ్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుందంటూ నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ మేరకు ఆమె వేలికి డైమండ్‌ రింగ్‌ తొడిగి ఉన్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ వార్తల్లో కొంత నిజం, మరికొంత అబద్ధం ఉంది.

అదెలాంగంటే.. మలైకా అరోరా మంగళవారం నాడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో డైమండ్‌ రింగ్‌ ధరించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. "మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాన్ని ఆరంభించబోతున్నారా? అయితే ఈ నిశ్చితార్థపు ఉంగరాలు అందుకు సరిగ్గా సరిపోతాయి. నేను పెట్టుకున్న రింగ్‌ ఎంతో బాగుంది కదూ.. ఇలాంటివి మాత్రమే కాదు, మీకు నచ్చిన రీతిలో రింగ్స్‌ తయారు చేయించుకోవచ్చు కూడా.." అంటూ ఓ జ్యూవెలరీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసింది మలైకా.

ఈ పోస్ట్‌ ద్వారా ఆమె కేవలం ఓ యాడ్‌ షూట్‌లో భాగంగానే ఈ ఫొటోలను పంచుకుందని స్పష్టమవుతోంది. కాబట్టి మలైకా, అర్జున్‌లు నిశ్చితార్థం చేసుకున్నారనేది అవాస్తవం. కాకపోతే ఆమె వేలికి వజ్రపు ఉంగరం ఉందన్నది మాత్రం నిజం. ఇదిలా వుంటే ఆమధ్య వీళ్లిద్దరూ కరోనా బారిన పడగా ఒకే ఇంట్లో క్వారంటైన్‌లో ఉండి మహమ్మారిని తరిమికొట్టారు. ఇదిలా వుంటే ప్రస్తుతం మలైకా 'ఇండియాస్‌ బెస్ట్‌ డ్యాన్సర్‌' అనే రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది.

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

చదవండి: డిన్నర్‌: ప్రియుడిని వెంటేసుకుని ఇంటికి!

ట్రోలింగ్‌: ఆ నటి ముసలావిడైపోయింది!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు