Nandamuri Balakrishna: రెగ్యులర్‌ చెకప్‌ కోసం హాస్పిటల్‌కు బాలకృష్ణ

26 Apr, 2022 08:38 IST|Sakshi

ఇటీవల విడుదలైన 'అఖండ' సక్సెస్‌తో మంచి ఫామ్‌లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బాలకృష్ణకు మరోసారి శస్త్ర చికిత్స జరిగిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు సర్జరీ చేశారంటూ సోషల్‌ మీడియాలో ఓ కథనం వైరల్‌గా మారింది. తాజాగా ఇది అసత్యవార్తగా తేలిపోయింది.

బాలయ్యకు సర్జరీ జరగలేదని, కేవలం రెగ్యులర్‌ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్లారని బాలయ్య సన్నిహితులు పేర్కొన్నారు. గతంలో 'అఖండ' సినిమా చిత్రీకరణలో జరిగిన ఓ ప్రమాదంలో బాలకృష్ణ కుడిభుజానికి గాయకావడంతో హైదరాబాద్‌ కేర్‌ హాస్పిటల్‌ వైద్యులు శస్త్ర చికిత్స చేసిన విషయం తెలిసిందే. 

చదవండి: బోయపాటితో మరో మూవీ.. కానీ బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన బాలయ్య!

మరిన్ని వార్తలు