సీ యూ సూన్‌

22 Aug, 2020 01:57 IST|Sakshi
ఫాహద్‌ ఫాజిల్

లాక్‌డౌన్‌ వల్ల అన్ని ఇండస్ట్రీ వాళ్లు షూటింగ్స్‌ ఆపేస్తే మలయాళ ఇండస్ట్రీలో ఓ బృందం ఈ పరిస్థితిని చాలెంజ్‌గా తీసుకుని లాక్‌డౌన్‌లోనే ఓ సినిమా ప్రారంభించి పూర్తి చేసింది కూడా. మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్, రోషన్‌ మాథ్యూస్, దర్శనా రాజేంద్రన్‌ ముఖ్య పాత్రల్లో మహేశ్‌ సి. నారాయణ్‌ దర్శకత్వంలో ‘సీ యూ సూన్‌’ అనే చిత్రం తెరకెక్కింది. 70 నిమిషాల నిడివి ఉండే ఈ సినిమాను పూర్తిగా ఐ ఫోన్‌లో చిత్రీకరించారు. చిత్రీకరణ మొత్తం లాక్‌డౌన్‌ సమయంలోనే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ చేశారు. సెప్టెంబర్‌ 1న ఈ సినిమా అమేజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు