కమల్‌తో ఫాహద్‌ ఫాజిల్‌.. ఫోటో వైరల్‌

25 Jul, 2021 15:09 IST|Sakshi

కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రమ్‌’. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫాహద్‌ ఫాజిల్, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రధారులు. ఇటీవలే ‘విక్రమ్‌’ షూటింగ్‌ ప్రారంభమైంది. ముందు కమల్, సేతుపతి కాంబినేషన్‌ సీన్స్‌ను తెరకెక్కించారు. తాజాగా ఫాహద్‌ ఈ సెట్స్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీనియర్‌ నటుడు కమల్‌తో యువనటుడు ఫాహద్‌ చిరనవ్వులు చిందిస్తూ, ఓ సెల్ఫీ తీసుకున్నారు.

మరిన్ని వార్తలు