మరో క్లాసిక్‌ సాంగ్‌ బలి.. తన సాంగ్‌ రీక్రియేషన్‌పై ఫాల్గుని పాథక్‌ అసంతృప్తి?

24 Sep, 2022 09:12 IST|Sakshi

ముంబై: టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఇలా ఏ వుడ్‌లో అయినా పాత హిట్‌ సాంగ్స్‌ను రీమిక్స్‌లు, రీ-రీమిక్స్‌లు, రీక్రియేషన్‌ల పేరుతో ఇప్పటి తరాలకు అందిస్తుండడం చూస్తున్నాం. అదే సమయంలో చాలావరకు కొత్తవాటిపై విమర్శలు వెల్లువెత్తుతుండం, సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా.. 

శ్రీలంక గాయని యోహానీతో ‘మనికే మేగే’ సాంగ్‌ను.. ‘థ్యాంక్‌ గాడ్‌’ సినిమా కోసం ఆమెతోనే పాడించి ఓ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. అయితే ఆ సాంగ్‌ కొరియోగ్రఫీ కంపోజిషన్‌పై మాములు తిట్లు పడడం లేదు. ఇక ఇప్పుడు మరో క్లాసిక్‌ పాటను చెడగొట్టే యత్నమూ జరుగుతోందన్న విమర్శ వెల్లువెత్తుతోంది. 

‘మైనే పాయల్‌ హై ఛన్‌కాయి’ సాంగ్‌ గుర్తుందా? అప్పట్లో నార్త్‌-సౌత్‌ తేడా లేకుండా ఊపేసిన సాంగ్‌. ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకట్టుకున్న సాంగ్‌ అది. సింగర్‌ నేహా కక్కర్‌ ‘ఓ సజ్‌నా’ పేరిట రీమిక్స్‌ చేయించి వదిలింది టీ సిరీస్‌. దీంతో మంచి పాటను చెడగొట్టారంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికే నేహా కక్కర్‌ పాడిన పలు రీక్రియేషన్స్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి గతంలో.


ఇక ఒరిజినల్‌ కంపోజర్‌ & సింగర్‌ ఫాల్గుని పాథక్‌ సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఫ్యాన్స్‌ షేర్‌ చేసిన కొన్ని మీమ్స్‌ను, విమర్శలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ రూపంలో షేర్‌ చేశారంటూ కథనాలు వెలువడుతున్నాయి. 

video credits: T-Series

ఫాల్గుని పాడిన మైనే పాయల్‌ హై ఛన్‌కాయి ఒరిజినల్‌ సాంగ్‌ 1999లో రిలీజ్‌ అయ్యింది. వివన్‌ భాటేనా, నిఖిలా పలాట్‌లు ఇందులో నటించారు. కాలేజీ షోలో తొలుబొమ్మల ప్రదర్శన మీద ఈ సాంగ్‌ పిక్చరైజేషన్‌ ఉంటుంది. ఇక కొత్త వెర్షన్‌ ఓ సజ్‌నాకు తన్షిక్‌ బాగ్చీ మ్యూజిక్‌ అందించగా.. ప్రియాంక శర్మ, ధనాశ్రీ వర్మ నటించారు.


videoCredits: FalguniPathakVEVO

మరిన్ని వార్తలు