ఫ్యామిలీ మ్యాన్‌ 2: సమంత ఎంత తీసుకుందో తెలుసా?

8 Jun, 2021 16:20 IST|Sakshi

ఈ మధ్య వెబ్‌ సిరీస్‌లకు డిమాండ్‌ పెరిగింది. పెద్దగా కొత్త చిత్రాలేవీ లేకపోవడంతో సినీప్రియులు సిరీస్‌ల మీద పడ్డారు. కొత్తగా ఏ వెబ్‌ సిరీస్‌ వచ్చినా చూసేవరకు వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో లేటెస్ట్‌గా వచ్చిన 'ద ఫ్యామిలీ మ్యాన్‌ 2' వెబ్‌సిరీస్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సమంత, మనోజ్‌ బాజ్‌పాయ్‌ల నటనకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఇదిలా వుంటే ఇందులోని నటీనటులకు ఎంతమేరకు పారితోషికం ముట్టిందనే దాని మీద సోషల్‌ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సమంత కంటే మనోజ్‌ బాజ్‌పాయ్‌కు ఎక్కువ ముట్టిందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో శ్రీకాంత్‌ తివారీ పాత్రలో కనిపించిన మనోజ్‌ మొత్తం ఎపిసోడ్లకు కలిపి రూ.10 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. రాజీ పాత్రతో రిలీజ్‌కు ముందే సిరీస్‌మీద బజ్‌ క్రియేట్‌ చేసిన సామ్‌ రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. మనోజ్‌కు భార్యగా నటించిన ప్రియమణి రూ.80 లక్షల మేర పారితోషికం పుచ్చుకున్నట్లు టాక్‌. ఇక షరీఫ్‌ హష్మీ రూ.65 లక్షలు, దర్శన్‌ కుమార్‌ ఒక కోటి, ఆశ్లేష ఠాకూర్‌ అర కోటి, శరద్‌ కేల్కర్‌ రూ.1.6 కోటి, సన్నీ హిందూజ రూ.60 లక్షల మేర అందుకున్నట్లు ఫిల్మీదునియాలో టాక్‌ నడుస్తోంది.

చదవండి: నేను మనసుపడ్డ బ్యాగ్‌ ధర ఎంతో తెలుసా?: సమంత

వెబ్‌ సిరీస్‌: ఫ్యామిలీమ్యాన్​ 2 రివ్యూ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు