'ఫ్యామిలీ మ్యాన్ 2' షూటింగ్ పూర్తి

25 Sep, 2020 17:36 IST|Sakshi

లాక్‌డౌన్ ముందు వ‌ర‌కు వెబ్ సిరీస్ అనేది ఒక‌టంద‌న్న విష‌యం కూడా చాలామందికి తెలియ‌దు. కానీ లాక్‌డౌన్ త‌ర్వాత మాత్రం సినిమాల‌ను కూడా ప‌క్క‌నపెట్టి మ‌రీ వెబ్ సిరీస్ వెంట ప‌డుతున్నారు. దీని క్రేజ్ గుర్తించిన న‌టీన‌టులు నెమ్మ‌దిగా ఓటీటీవైపు అడుగులు వేస్తున్నారు. అగ్ర‌తార‌లు కూడా వెబ్ సిరీస్‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు. అలా టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత 'ఫ్యామిలీ మ్యాన్ - 2'లో న‌టించారు. ఇది ఘ‌న‌ విజ‌యం సాధించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌కు సీక్వెల్ అన్న విష‌యం తెలిసిందే. (చ‌ద‌వండి: ‘మీర్జాపూర్‌-2’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..)

అందులోనూ ఆమె తొలిసారి ఉగ్ర‌వాదిగా క‌నిపించ‌నున్న‌ట్లు భోగ‌ట్టా. ఇందులో సామ్‌ త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్‌ను రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. మ‌నోజ్ భాజ్ పాయ్‌, ప్రియ‌మ‌ణి, సందీప్ కిష‌న్‌, త‌దిత‌రులు న‌టిస్తున్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డ్డ మిగిలిన షూటింగ్ కూడా పూర్తైన‌ట్లు ద‌ర్శ‌కుడు రాజ్‌, డీకే అధికారికంగా వెల్ల‌డించారు. నెగెటివ్ రోల్‌లో సమంతను చూసేందుకు ఆమె అభిమానులు ప‌రిత‌పించిపోతున్నారు. 'ఫ్యామిలీ మ్యాన్ - 2' త్వ‌ర‌లో అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కానుంది. (చ‌ద‌వండి: క్రేజీ రైడ్‌కి రెడీయా?)

Finally every single shot of #TheFamilyManSeason2 is done! Had to somehow pull it off during these tough times! Incredible job by our crew! @primevideoin @iamsumankumar @suparnverma @rahulgandhi9 @manojkumarkalaivanan @cameronbryson @sainisjohray @aejaz_gulab @yannickben @sumeetkotian @ketan_sodha @suveera.swetesh.stylist @castingchhabra @tusharseth09 @i_dpsingh @krunaliiii @wasim_khansaab @sunil11711 @ketkisamant @vandana8810 @suhasnavarathna @manishamakwana18 @kochar.chirag @sharankothari @soumiltiwarii @nasir5488 @kohli__utkarsha @rk_pranav @zuhair30 @_shellysharma @hiren181 @chatterjeeabhinav @the_kochikaran @dev23karan @roshan_chowdhry @ramcharantej.labani @vidhidedhia2 @ashitajha @zenishamerchant @aar.u.shirious @aparajita_atre @aarti.rajput01 @itisanu

A post shared by Raj & DK (@rajanddk) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు