ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూత

17 Apr, 2021 07:29 IST|Sakshi

తమిళనాడు: ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూశారు. నిన్న ఉదయం 11 గంటలకు గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో  వివేక్ నటించారు. దర్శకుడు కె.బాలచందర్‌ పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు. 'మనదిల్ ఉరుది వేండం' ద్వారా ఆయన సినీ ఆరంగేట్రం చేశారు.

రజనీకాంత్, కమల్‌హాసన్‌, విజయ్, అజిత్‌తో కలిసి ఆయన నటించారు. గురువారం చెన్నైలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వివేక్.. ప్రజలంతా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతలోనే వివేక్‌ ఆకస్మిక మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.
చదవండి:
ముళ్లపొదల నుంచి ఏడుపులు.. అసలేం జరిగింది..?
సీబీఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా: రాత్రి కరోనా.. తెల్లారే మృతి

మరిన్ని వార్తలు