ప్రముఖ రచయిత్రి వాణీ మోహన్‌ కన్నుమూత

14 Nov, 2021 08:19 IST|Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): ప్రముఖ రచయిత్రి వాణీ మోహన్‌ (80) మరణించారు. ఇటీవల చలిజ్వరం బారిన పడిన ఆమె రక్తంలో చక్కెర శాతం పడిపోవడంతో చెన్నైలోని స్వగృహంలో ఆమె మృతి చెందారు. అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు ఆదివారం చెన్నై చేరుకోనున్నారని, అంత్యక్రియలు సోమవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. పదేళ్ల క్రితం కన్నుమూసిన ఆమె భర్త వఠ్యం మోహన్‌ రైల్వే ఉన్నతాధికారిగా ఉత్తరాది రాష్ట్రాల్లో విధులు నిర్వహించేవారు.

ఈ కాలంలో అక్కడి తెలుగువారితోఅనేక కార్యక్రమాలను ఈమె నిర్వహించేవారు. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, విశేషాలను భర్తతో కలిసి గ్రంథస్థం చేశా రు. చెన్నై వచ్చాక ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్‌ స్ఫూర్తితో రచయితగా ఎదిగిన వాణీ మోహన్‌ రాసిన అనేక కథలు, కవితలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి చెన్నై కేంద్రంలో దశాబ్దాలపాటు అనేక అంశాలపై ఆమె ప్రసంగించారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన సొసైటీ సభ్యురాలిగా ఆ భవనాన్ని నిర్మింపజేసిన వైఎస్‌ శాస్త్రి  ఏర్పాటు చేసిన అనేక కార్య క్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. కాగా ఆమె మృతికి అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి కార్యదర్శి వై. రామకృష్ణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు