‘షారుక్‌లా అవ్వాలంటే ఏం తినాలి?’

28 Oct, 2020 21:02 IST|Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తన అభిమానులకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆకస్మాత్తుగా సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యి.. అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి.. వారిని ఖుషి చేశారు. మంగళవారం సాయంత్రం షారుక్‌ ఆస్క్‌ మీ ఎనీథింగ్‌ పేరుతో ట్విట్టర్‌ చాట్‌ సెషన్‌ నిర్వహించారు. ఈ క్రమంలో అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానలతో పాటు ట్రోలర్స్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఓ ట్విట్టర్‌ యూజర్‌ ‘మీ సాధారణ స్నేహితులతో కలిసి డిన్నర్‌కి వెళితే బిల్‌ని అందరూ షేర్‌ చేసుకుంటారా.. లేక మీరే పే చేస్తారా’ అని అడిగారు. అందుకు షారుక్‌ చాలా ఫన్నీ ఆన్సర్‌ చెప్పారు.‘ ఫేమస్‌, నాన్‌ ఫేమస్‌ కాదు.. వారే పే చేస్తారు. ఎందుకంటే నేను అసలు డబ్బులే తీసుకెళ్లను’ అన్నారు. మరో యూజర్‌‘ మీరు నవ్విన ప్రతిసారి ఆకాశంలో ఓ కొత్త నక్షత్రం పుడుతుంది. ఆ విషయం మీకు తెలుసా ’అని ప్రశ్నిస్తే.. అందుకు బాద్‌ షా ‘నిజమా.. అలా అయితే నేను ఇంకా ఎక్కువ నవ్వుతా. అలా ఓ చిన్న ఫ్లూటోని తయారు చేసి విశ్వంలోకి పంపుతా’ అంటూ సమాధానమిచ్చారు. (చదవండి: ట్రోలింగ్‌; నువ్వు అసహ్యంగా ఉన్నావ్‌)

మరొక అభిమాని ‘షారుక్‌ ఖాన్‌లాగా మారాలంటే నేను ఏం తినాలి’ అని ప్రశ్నించాడు. అందుకు ఎస్‌ఆర్‌కే ‘ఇది ఒక జోక్‌. నేను కొంతకాలం క్రితం చదివాను. నా ఉద్దేశ్యం కాదు. ఒక జోక్‌ మాత్రమే. ఏంటంటే ప్రజలు తినాలని చెప్తారు.. కానీ నేను మాత్రం ఎప్పుడు భారీగా తినలేదు’ అన్నారు. ఇక త్వరలోనే కొత్త ప్రాజెక్ట్‌ ప్రకటిస్తానని తెలిపారు. కోవిడ్‌ పరిస్థితులు కంట్రోల్‌ కాగానే కొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తాను అన్నారు. ఇక నవంబర్‌ 2న షారుక్‌ పుట్టిన రోజు. ఈ క్రమంలో ఈ ఏడాది తనను విష్‌ చేయడానికి అభిమానులు తన ఇంటి వద్ద గుమి కూడవద్దని కోరారు. ప్రతి ఏడాది షారుక్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయన నివాసం మన్నత్‌ వద్దకు చేరుకుని శుభాకాంక్షలు తెలుపుతారు. కానీ ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా అలా చేయవద్దని కోరారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు