సోహైల్‌ బర్త్‌డే: ఖరీదైన బైక్‌ బహుమతిగా ఇచ్చిన ఫ్యాన్

24 Apr, 2021 20:03 IST|Sakshi

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ఎంతోమందికి నేమ్, ఫేమ్ తీసుకొచ్చింది. బిగ్‌బాస్‌ ముందు వరకు అంతగా పరిచయం లేదని వారంతా ఈ షోతో ఎంతో ఫేమస్‌ అయిపోయారు. వీరిలో సింగరేణి ముద్దు బిడ్డ సయ్యద్‌ సోహైల్ ఒకడు. అప్పటిదాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్‌-4 సీజన్‌ ఒక్కసారిగా గుర్తింపునిచ్చింది. హౌజ్‌లో‌ ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకన్నాడు ఈ సింగరేణి ముద్దు బిడ్డ.

100 రోజుల పాటు హౌస్‌లో సందడి చేసిన సోహైల్ ఈ సీజన్‌లో‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. దీంతో సోహైల్‌కు ఒక్కసారిగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వీపరితంగా పెరిగిపోయిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బిగ్‌బాస్‌ షో నుంచి బయటకు రాగానే అతడి కోసం వందల సంఖ్యలో ఫ్యాన్స్‌ బారులు తీరిన దృశ్యమే ఇందుకు ఉదహరణ. తాజాగా ఓ అభిమాని సోహైల్‌ బర్త్‌డే సందర్భంగా సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశాడట. ఏప్రీల్‌ 18న సోహైల్‌ పుట్టిన రోజు సందర్భంగా లక్కీ అనే అభిమాని సోహైల్‌కు ఖరిదైన స్పోర్ట్స్‌ బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోహైల్‌ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ షేర్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేగాక సదరు అభిమానికి ఈ సందర్భంగా సోహైల్‌ కృతజ్ఞతలు తెలిపాడు.

కాగా బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత సోహైల్‌ లైఫ్‌ టర్న్‌ అయ్యిందని చెప్పవచ్చు. బిగ్‌బాస్‌ నుంచి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించాలని ఉన్నట్లు తన మనసులోని మాటను సోహైల్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలా తన కోరికను బయట పెట్టాడో లేదో అలా సోహైల్‌కు దర్శక నిర్మాతల నుంచి సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ అనంతరం వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్‌.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్‌ రెడ్డి’, ‘ప్రెషర్‌ కుక్కర్‌’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోహైల్‌ స్నేహితుడు శ్రీనివాస్‌ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నాడు. 

A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official)

మరిన్ని వార్తలు