ఎన్టీఆర్‌ చలానా కట్టిన అభిమాని, కానీ!

22 Jan, 2021 17:04 IST|Sakshi

హీరో కోసం ఏదైనా చేస్తారు అభిమానులు. ఇదిగో ఇక్కడ చెప్పుకునే అభిమాని కూడా అంతే! పెద్ద మనసుతో యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ కారుకు సంబంధించిన ట్రాఫిక్‌ చలానాను చెల్లించాడు. దీనికి ప్రతిఫలంగా చిన్న కోరికను తీర్చమని హీరోను అడిగాడు. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి..

గత నెలలో నెహ్రూ ఔటర్‌ రింగు రోడ్డు మీద మితిమీరిన వేగంతో కారు నడిపినందుకుగానూ తెలంగాణ పోలీసులు జూనియర్‌ ఎన్టీఆర్‌కు రూ.1035 జరిమానా విధించారు. ఇప్పటివరకు తారక్‌ ఆ జరిమానా చెల్లించనేలేదు. ఈ విషయం తెలుసుకున్న ఓ అభిమాని హీరోకు విధించిన చలానా మొత్తం కట్టేశాడు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ దీనికి ప్రతిఫలం ఆశించాడు. 'నాకు, నా స్నేహితులు కొందరికి మల్లికార్జున లేదా భ్రమరాంభ థియేటర్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్లు ఇప్పించండి' అని రాసుకొచ్చాడు. మరి దీనిపై ఎన్టీఆర్‌ స్పందిస్తారో, లేదో చూడాలి! (చదవండి: ప్రభుదేవా తమ్ముడి డాన్స్‌ రాజా)

కాగా స్వాతంత్ర సమర యోధులు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ బడ్జెట్‌ మల్టీస్టారర్‌ చిత్రం రౌధ్రం రణం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్‌). అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏ ఏడాదే రిలీజ్‌ చేయాలని ఆలోచిస్తున్నారు. జక్కన్న రాజమౌళి చెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ క్లైమాక్స్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో చరిత్రలో ఎప్పుడూ ఎదురుపడని కొమురం భీమ్‌, సీతారామరాజు సినిమాలో మాత్రం ఓ మంచిపని కోసం కలిసి యుద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌: కథ క్లైమాక్స్‌కు వచ్చింది)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు