Superstar Krishna Death: కృష్ణ లేని లోటు ఎవరు పూడ్చలేనిది, ఆయన మళ్లీ పుట్టాలి: ఫ్యాన్స్‌ ఆవేదన

16 Nov, 2022 15:04 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకి తరలించారు. నానక్‌రామ్‌ గూడలోని ఆయన నివాసం నుంచి పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచి ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. తమ అభిమాన నటుడి కడచూపు కోసం పద్మాలయ స్టూడియోకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు రావడంతో పద్మాలయ స్టూడియో ముందు అభిమానుల తాకిడి ఎక్కువైంది.

ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాదు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా అభిమానులు అయనను కడసారి చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అంతా ఆయన మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన సినిమాలు, పవర్ఫుల్‌ డైలాగ్స్‌ గుర్తు చేస్తూ సూపర్‌స్టార్‌ ఘననివాళులు అర్పిస్తున్నారు. ‘‘ఆయన ఓ హీరో మాత్రమే కాదు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన చనిపోయారన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాం. మా ఇంట్లో మనిషి మరణించిన దానికంటే ఎక్కువగ బాధగా ఉంది. ఆయన కడచూపు కోసం వచ్చిన ఈ అభిమానుల సంద్రోహమే ఆయన మంచితనానికి నిదర్శనం. ఆయన ఓ లెజెండరి నటులు. సినిమాల్లో తన పాత్రలతో ఎన్నో వేరియేషన్స్‌ చూపించారు. ఆయన లేని లోటు ఇండస్ట్రీలో ఎవరు పూడ్చలేరు. ఆయన మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నాం’ అంటూ ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పచ్చబొట్టుతో అభిమానం
ఇక సిద్దిపేటకు చెందిన ఓ అభిమాని ఏకంగా కృష్ణపేరును చేతిపై పచ్చబొట్టు వేసుకున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ అంటూ చేతిపై పచ్చబొట్టు వేసుకుని అభిమానాన్ని చాటుకున్నాడు. కృష్ణగారు చనిపోయారని తెలిసి అన్నం కూడా తినలేదు అంటూ సదరు అభిమాని కన్నీరు పెట్టుకున్నాడు. అనంతరం అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ఓ పవర్ఫుల్‌ డైలాగ్‌ను ఆపకుండ చెబుతూ తన అభిమాన నటుడికి నివాళి అర్పించాడు. 

అచ్చం కృష్ణలా మారి.. 
ఇక ఓ అభిమాని అచ్చం కృష్ణలా తయరై వచ్చాడు. ఊహా తెలిసినప్పటి నుంచి కృష్ణగారు అంటే అభిమానం, ఆ అభిమానంతోనే ఇక్కడి వచ్చాను. యమదొంగ, నెంబర్‌ వన్‌, అల్లూరి సీతారామరాజు. ఆయన సినిమాలన్నా, ఆయన డైలాగ్స్‌ అంటే గూస్‌బంప్స్‌ రావాల్సిందే.  ఈ సందర్భంగా అల్లూరి సీతారామారాజు మూవీలోని డైలాగ్స్‌ చెప్పి అదరగొట్టాడు. 

మరిన్ని వార్తలు