Anupama Parameswaran: సూర్యపేటలో అనుపమ సందడి, షాకిచ్చిన ఫ్యాన్స్‌

26 Apr, 2022 16:03 IST|Sakshi

Fans Gave Shock To Anupama Parameswaran: ఇటీవల ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కు వెళ్లిన హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌కు ఫ్యాన్స్‌ షాకిచ్చారు. సోమవారం ఆమె సూర్యాపేట జిల్లా కోదాడలోని పీపీఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. దీంతో అనుపమను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించిన అనుపమ కాసేపు మీడియాతో ముచ్చటిచ్చింది. అనంతరం ఆమె తిరుగు ప్రయణమవుతుండగా సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్‌, స్థానికులు ఎగబడ్డారు.

చదవండి: త్వరలోనే తెలుగు సినిమా చేస్తా : కేజీఎఫ్‌ హీరోయిన్‌

అయితే అప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. దీంతో తను కాసేపు ఇక్కడే ఉండాలని డిమాండ్‌ చేస్తూ కొందరు ఆకతాయిలు ఆమె కారు టైర్లలో గాలి తీశారట. దీంతో ఫ్యాన్స్‌ తీరుకు అనుపమ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో షాపు నిర్వాహకులు అనపమకు మరో కారు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు పంపించారట. కాగా అనుపమ చివరిగా ‘రౌడీ బాయ్స్‌’లో సందడి చేసింది. తాజాగా ఆమె నటించిన ‘18 పేజెస్‌’ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆమె ‘కార్తికేయ 2’, ‘బటర్‌ ఫ్లై’ చిత్రాల్లో నటిస్తోంది.  

చదవండి: టికెట్‌ రేట్ల గురించి వేడుకుంటే తప్పేం కాదు: చిరంజీవి

మరిన్ని వార్తలు