రామ్‌చరణ్‌ బర్త్‌డే సీడీపీ: ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌!

25 Mar, 2021 12:22 IST|Sakshi

హీరోల బర్త్‌డేలు అంటే మామూలుగా ఉండదు. ఫ్యాన్స్‌ పోటాపోటీగా సెలబ్రేషన్స్‌ ప్లాన్‌ చేస్తుంటారు. ఏ యేటికాయేడు రెట్టించిన ఉత్సాహంతో వేడుకలు చేసేందుకు రెడీ అవుతుంటారు. ఇక సోషల్‌ మీడియాలో చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కామన్‌ డీపీతో రచ్చరచ్చ చేస్తుంటారు. చిన్నస్థాయి హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరూ కామన్‌ డీపీ చేయించుకుంటున్నారు. ఇది టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే రేపు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ బర్త్‌డే.

స్టార్‌ హీరో, అందులోనూ మెగాస్టార్‌ తనయుడు.. ఇంకేముందీ.. సీడీపీ ఓ రేంజ్‌లో ఉంటుందని భావించారంతా.. ​కానీ అందరికీ షాకిస్తూ ఓ సాదాసీదా డీపీని హీరో సాయి ధరమ్‌ తేజ్‌ విడుదల చేశాడు. ఇది చూసిన అభిమానుల ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. మరీ ఇంత ఘోరమా అంటూ సాయిధరమ్‌ తేజ్‌ మీద గరమవుతున్నారు. దీనికంటే మేము చేసిన డీపీ బెటర్‌గా ఉందంటూ కొన్ని ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. ఇది జస్ట్‌ పోస్టర్‌లా ఉందే తప్ప సీడీపీలా లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

చదవండి: రామ్‌చరణ్‌ బర్త్‌డేకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్పెషల్‌ గిఫ్ట్‌!

దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది: పూజా హెగ్డే

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు