అతడి చెంప పగలకోడితే.. తిరిగి నన్ను కొట్టాడు: హీరోయిన్‌

26 Apr, 2021 18:45 IST|Sakshi

ఆమిర్‌ ఖాన్‌ స్టోర్స్‌ డ్రామా ‘దంగల్‌’తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు నటి ఫాతిమా సనా షేక్‌. తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత చెత్త అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు ఫాతిమా సన. ఓ సారి తాను ఓ ఆగంతకుడి చెంప పగలకొట్టాని.. అయితే అతడు తిరిగి తనను కొట్టాడని తెలిపారు సన. దీని గురించి సనా మాట్లాడుతూ.. ‘‘ఓ సారి జిమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ వ్యక్తి నా వైపు రావడం గమనించాను. అప్పటికే అతడు కాస్త తేడాగా అనిపించాడు. నేను నడుచుకుంటూ వెళ్తుండగా.. అతడు వెంటే వచ్చాడు’’ అని తెలిపారు.

‘‘నేను ఆగి ‘ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు’ అని అతడిని ప్రశ్నించాను. అందుకతడు ‘అది నా ఇష్టం’ అన్నాడు. వెంటనే నేను కోపంతో ‘తన్నులు తినాలని ఉందా ఏంటి’ అన్నాను. దానికతడు ‘కొట్టు’ అన్నాడు. అప్పటికే నా ఓపిక నశించింది. దాంతో అతడిని కొట్టాను. వెంటనే అతడు తిరిగి నన్ను కొట్టాడు. నేను మా నాన్నని పిలిచాను. ఆయన నా సోదరుడితో పాటు అతడి ఫ్రెండ్స్‌ని కూడా తీసుకుని వచ్చాడు. ఏమైంది అని అడిగాడు. నేను జరిగిన విషయం చెప్పాను. వెంటనే మా నాన్న, మిగతవారు నన్ను కొట్టిన అతడిని పట్టుకునేందుకు పరిగెత్తారు. కానీ అతడు దొరకలేదు’’ అని తెలిపారు. 

ఇక ఇండస్ట్రీలో తాను ఎన్నో చేదు అనుభవాలని ఎరదొర్కాన్నాని.. చాలా మంది దర్శకులు తమతో గడిపితేనే అవకాశాలు ఇస్తామన్నారని తెలిపారు ఫాతిమా సన. చాలా సార్లు తనకు వచ్చిన అవకాశాలను తిరిగి తీసుకున్నారని వెల్లడించారు. ఎవరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా తను తాను నిరూపించుకున్నాను అన్నారు ఫాతిమా సన. 

చదవండి: ‘మా స్నేహన్ని తప్పుగా చూస్తున్నారు’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు