అమీర్‌-కిరణ్‌ విడాకులు.. తెరపైకి దంగల్‌ నటి పేరు!

4 Jul, 2021 07:53 IST|Sakshi

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ తన భార్య కిరణ్‌ రావ్‌ నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన మరుక్షణమే.. అదొక హాట్‌ టాపిక్‌గా మారింది. సెటైర్లు, ట్రోలింగ్‌, నెగెటివ్‌ కామెంట్లతోనే నిన్నంతా సోషల్‌ మీడియాలో చర్చ నడించింది. అయితే హాఠాత్తుగా ఫాతిమా సనా షేక్‌ పేరు తెర మీదకు వచ్చింది. రికార్డుస్థాయిలో ఆమె పేరు హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు ట్విటర్‌లో పోస్ట్ అయ్యాయి.. ఇంకా అవుతూనే ఉన్నాయి. 

అమీర్‌ ఖాన్‌తో యంగ్‌ హీరోయిన్‌ ఫాతిమాకు ఎఫైర్‌ ఉందని, అందుకే వాళ్లిద్దరూ విడిపోతున్నారనేది నెటిజన్స్‌ ఒపీనియన్‌. అందుకే వాళ్ల ఫొటోలతో, ఫాతిమాను తెర మీదకు తెచ్చి ఆడుకుంటున్నారు. 29 ఏళ్ల ఫాతిమా.. 56 ఏళ్ల అమీర్‌తో వరుసగా రెండు సినిమాలు చేసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని బాలీవుడ్‌ మీడియా హౌజ్‌లలో పుకార్లు వినిపించాయి. ఆ వ్యవహారాన్ని అమీర్‌ లైట్‌ తీసుకోగా.. ఫాతిమా మాత్రం తనకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు తన గురించి తప్పుగా రాయడం సరికాదని వ్యాఖ్యానించింది కూడా.

భావ ప్రకటన స్వేచ్ఛ..
ఇక ఫాతిమాతో అమీర్‌కు లింక్‌ అంటగట్టడం.. ఈ ఎఫైర్‌ను విడాకులకు ముడిపెట్టడం అంతా భావ స్వేచ్ఛ ప్రకటనలో భాగమేనని పలువురు నెటిజన్స్‌ వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో దేశం పట్ల, దేశభద్రత పట్ల, ప్రభుత్వం పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా వ్యవహరించిన అమీర్‌ తీరును ఈ సందర్భంగా కొందరు ప్రస్తావిస్తున్నారు. ‘అమీర్‌ నువ్వు ఎలాగైనా భావ స్వేచ్ఛ ప్రకటన గురించి ఆందోళన వ్యక్తం చేశావో గుర్తుందా? నీ భార్యా దేశం విడిచి వెళ్లాలని ఉందని చేసిన కామెంట్లు గుర్తున్నాయా?.. ఇప్పుడు మా భావ ప్రకటన స్వేచ్ఛను ప్రదర్శిస్తున్నాం. ఈ విషయంలో నువ్వు, నీ భార్య, నీ ప్రియురాలు(ఫాతిమా) .. ఎవరూ కూడా మమ్మల్ని అడ్డుకోలేరు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కూతురు.. ఆ వెంటనే హీరోయిన్‌
హైదరాబాద్‌లో పుట్టిన ఫాతిమా సనా షేక్‌.. బాలనటిగా పలు హిందీ చిత్రాల్లో నటించింది. నువ్వు నేను ఒకటవుదాం (2015)తో తెలుగులో నటించిన ఫాతిమా.. 2016లో అమీర్‌ ఖాన్‌ ‘దంగల్‌’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో అమీర్‌ కూతురిగా నటించిన ఫాతిమా.. ఆ వెంటనే థగ్స్‌ ఆఫ్‌ హిందోస్థాన్‌లో జోడిగా నటించింది.

ప్రమోషన్స్‌ ముగిశాక కూడా ఇద్దరూ చాలాకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ముంబైలో దిగినప్పుడల్లా ఆమె అమీర్‌ ఖాన్‌ ఇంటికి వెళ్లడంతో పుకార్లు మరింత బలపడ్డాయి.  దీంతో రూమర్లు మొదలయ్యాయి. చివరికి అంబానీ ఇంట జరిగిన పార్టీకి, అవార్డుల వేడుకల దగ్గర కూడా వీళ్లు జోడిగా కనిపించడం.. అప్పటిదాకా యాక్టివ్‌గా కెమెరాలకు కనిపించిన కిరణ్‌రావ్‌ సైడ్‌ అయిపోవడంతో ఆ రూమార్లకు మరింత బలం చేకూరింది. 

మరిన్ని వార్తలు