ఇష్టమైన బైక్‌ను అమ్మకానికి పెట్టిన 'ఫిదా' నటుడు

2 May, 2021 07:58 IST|Sakshi

ఆక్సిజన్‌ అందక నరకయాతన అనుభవిస్తున్న కోవిడ్‌ పేషెంట్లు ఎంతమందో.. అలాంటి వారికి తనవంతు సాయం చేయాలని ముందుకొచ్చాడు ఓ నటుడు. ఇందుకోసం ఏకంగా తన బైక్‌ను అమ్మకానికి పెట్టడం గమనార్హం. తన బైక్‌ను తీసుకొని ఆక్సిజన్‌ను ఇవ్వండని, అవసరమైన పేషెంట్లకు దాన్ని అందిస్తానని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఎంతో ప్రేమగా చూసుకునే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను తనే స్వయంగా శుభ్రం చేస్తున్న ఫొటోలతో పాటు దానిపై చక్కర్లు కొట్టిన ఫొటోలను సైతం షేర్‌ చేశాడు. ఈ నటుడు తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకున్న జనాలు అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కాగా అతడు గతేడాది అక్టోబర్‌లో కరోనా బారిన పడి అనంతరం ఆ మహమ్మారిని జయించాడు. 

ఇదిలా వుంటే వరుణ్‌తేజ్‌, సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా సినిమాలో హర్షవర్ధన్‌ ఓ ముఖ్యపాత్రలో నటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు తకిట తకిట, నా ఇష్టం, కవచం వంటి పలు సినిమాలు చేశాడు. బాలీవుడ్‌లోనూ సనమ్‌ తేరీ కసమ్‌ వంటి అడపాదడపా చిత్రాల్లో నటించాడు. ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ 5లో రిలీజైన తైష్‌ సినిమాలోనూ కనిపించాడు.

A post shared by Harshvardhan Rane (@harshvardhanrane)

చదవండి: విషాదం: టాలీవుడ్‌ యువ దర్శకుడు కరోనాతో మృతి

అక్కడ బోల్తా పడినా ఓటీటీలో మాత్రం​ సూపర్‌ హిట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు