బాలయ్య సినిమా నుంచి ఆ ఇద్దరూ ఔట్‌!

6 Mar, 2021 14:15 IST|Sakshi

బాలయ్య-బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పుకారు ఫిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ఫైట్‌ మాస్టర్స్‌గా వ్యవహరిస్తోన్న రామ్‌-లక్ష్మణ్‌లు సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బోయపాటి సినిమా అంటే యాక్షన్‌ సన్నివేశాలకు ఎంత ప్రాధన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో రామ్‌-లక్ష్మణ్‌లు ఇద్దరు చిత్రానికి మూల స్తంభాలని చెప్పవచ్చు. అలాంటిది ప్రస్తుతం వీరిద్దరూ బాలయ్య-బోయపాటి సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

బోయపాటితో విబేధాల కారణంగానే వీరిద్దరూ ఈ సినిమా నుంచి తప్పకున్నారని సమాచారం. వీరి స్థానంలో స్టంట్‌ శివ ఎంటరైనట్లు తెలిసింది. అయితే దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫైట్‌ మాస్టర్స్‌గా రామ్-లక్ష్మణ్‌లకు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు మాస్‌ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సరికొత్తగా ఫైట్లను కంపోజ్‌ చేస్తుంటారు. వీరి ఫైట్లకు ప్రత్యేకంగా అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. 

చదవండి:
సాహసం: అఘోరాగా మారిన బాలకృష్ణ!

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు