ఆ క్రెడిట్‌ ఆయనకే వెళ్తుంది: రామ్‌-లక్ష్మణ్‌

8 Jul, 2021 21:42 IST|Sakshi

ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌లు దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మగధీరతో పాటు రాజమౌళి తెరకెక్కించిన పలు సినిమాలకు రామ్‌-లక్ష్మణ్‌లు ఫైట్‌ మాస్టర్స్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజమౌళి సినిమాకు పని చేసినా పేరు రాదంటూ వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆయన సినిమాలో ఫైట్‌ మాస్టర్స్‌గా చేసిన వారెవరికి అంతగా గుర్తింపు ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తన సినిమాల ఫైట్స్‌, యాక్షన్‌ సన్నివేశాలన్ని కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటారు. 70 శాతం స్టంట్స్ కూడా రాజమౌళి స్వయంగా పర్యవేక్షిస్తాడు. దీంతో స్టంట్స్‌ తామే సొంతంగా చేసినా కూడా ఆ ఫీలింగ్ ఉండదని తెలిపారు.

తమకే కాదు.. రాజమౌళి సినిమాలకు ఎవరు పని చేసినా కూడా స్టంట్స్ విషయంలో మాస్టర్స్‌కు పెద్దగా పేరు రాదు.. క్రెడిట్ అంతా రాజమౌళికే వెళ్తుందని’ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే జక్కన్న సినిమాకు పని చేయడానికి తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని, అయితే ఆయన సినిమాలకు పని చేయాలంటే ఒకేసారి 40 నుంచి 60 రోజుల వరకు డేట్స్‌ ఇవ్వాలన్నారు. ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు సిద్ధంగా ఉండాలని, టైం లేదు, ఇప్పుడు కుదరదు అనే మాటలు చేబితే ఆయనకు అసలు నచ్చదని చెప్పారు. డేట్స్ ఎక్కువగా ఇవ్వలేకపోవడమే వల్ల తాము బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలకు పని చేయలేకపోయామన్నారు. ఆర్ఆర్ఆర్‌లోనూ ఇంటర్వెల్ ఫైట్ 10 రోజులు చిత్రీకరించామని, చరణ్‌కు దెబ్బ త‌గడంతో ఆ మూవీ షూటింగ్‌ 40 రోజులు అయిపోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకోక తప్పలేదన్నారు. 

కాగా రాజమౌళి సినిమాలో పనిచేసేందుకు ఇతర పరిశ్రమ వాళ్లు ఆసక్తిగా ఉంటారనే విషయం తెలిసిందే. తమిళ, కన్నడతో పాటు బాలీవుడ్‌ నటీనటులు జక్కన సినిమాలో ఓ చిన్న పాత్ర చేసిన చాలు అనుకుంటున్నారు. అందుకే ఆయన సినిమాలో చిన్న పాత్ర చేయడానికి కూడా సిద్ధ‌ప‌డుతుంటారు. బాహుబలి సినిమాలో కేవలం 10 నిమిషాలు కూడా లేని అస్లాం ఖాన్ పాత్ర సుదీప్ లాంటి స్టార్ హీరో చేశాడంటే రాజమౌళి క్రేజ్‌ ఎంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ తన పాత్ర 15 నిమిషాలే అయినప్పటికి స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌ లాంటి వారు అంగీకరించారంటే దానికి కారణంగా రాజమౌళి. అలాంటే దర్శక ధీరుడిపై రామ్‌-లక్ష్మణ్‌లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు