2018 Movie: ఆస్కార్ బరిలో 2018.. అవార్డ్ దక్కేనా?

27 Sep, 2023 13:08 IST|Sakshi

కేరళ వరదల నేపథ్యంలో రూపొందించిన చిత్రం 2018. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. చిన్న సినిమాగా వచ్చి భారీ వసూళ్లు సాధించింది. ‍అయితే తాజాగా ఈ చిత్రం భారత్​ తరఫున ప్రతిష్టాత్మక ఆస్కార్​ రేసులో నిలిచింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మలయాళంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. 

(ఇది చదవండి: 2018 మూవీ రివ్యూ)

ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం  మౌత్ టాక్‌తోనే భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు.

2024 ఆస్కార్ అకాడమీ అవార్డులకు భారతదేశం అధికారిక ఎంట్రీ చిత్రంగా ఎంపిక చేసినట్లు కన్నడ చిత్ర దర్శకుడు గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని జ్యూరీ ప్రకటించింది. నామినేషన్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంటేనే ఈ చిత్రం అవార్డుకు అర్హత సాధిస్తుంది. కాగా.. 96వ ఆస్కార్ వేడుకలు మార్చి 10, 2024న లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్‌లో జరగనున్నాయి.

(ఇది చదవండి: ఈ అమ్మాయి ఎవరో తెలుసా?.. ఆర్జీవీ ఆస‍క్తికర ట్వీట్!)

ఆస్కార్-2023 ఏడాదిలో ఎంట్రీకి ఛెలో షో (2022), కూజాంగల్ (2021), జల్లికట్టు (2020), గల్లీ బాయ్ (2019), విలేజ్ రాక్‌స్టార్స్ (2018), న్యూటన్ (2017), విసరాని (2016) చిత్రాలు ఎంపిక కాగా.. ఏది ఎంపిక అవ్వలేదు. ఇప్పటివరకు మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్ చిత్రాలు మాత్రమే ఆస్కార్‌కు నామినేట్ భారతీయ సినిమాలుగా నిలిచాయి.

ఆస్కార్ 2023లో ఇండియా సినిమాలు రెండు అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ విభాగంలో అవార్డ్ రాగా.. డాక్యుమెంటరీ ఫిల్మ్‌ ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. కార్తికీ గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో దక్కించుకుంది. 


 

మరిన్ని వార్తలు