గురుదత్‌ బయోపిక్‌

31 Jul, 2020 05:23 IST|Sakshi
గురు దత్

‘ప్యాసా, కాగజ్‌ కే ఫూల్, షాహిబ్‌ బీవీ అవుర్‌ గులామ్‌’ వంటి ఎన్నో అపురూపమైన హిందీ సినిమాలను అందించిన దిగ్గజ దర్శకుడు గురు దత్‌ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఆయన తెరకెక్కించిన క్లాసిక్‌ చిత్రం ‘ప్యాసా’ టైటిలే ఈ బయోపిక్‌ కి కూడా పెట్టనున్నారు. తొలి చిత్రం ‘ధర్మ్‌’తో నేషనల్‌ అవార్డు అందుకున్న దర్శకురాలు భావనా తల్వార్‌ ఈ బయోపిక్‌ ను డైరెక్ట్‌ చేయనున్నారు. షీతల్‌ తల్వార్‌ తో కలసి భావన ఈ సినిమాను నిర్మించనున్నారు కూడా. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

మరిన్ని వార్తలు