Adah Sharma The Kerala Story: వివాదంలో మరో బాలీవుడ్‌ చిత్రం, కేరళ వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత

10 Nov, 2022 12:57 IST|Sakshi

చాలా గ్యాప్‌ తర్వాత నటి అదా శర్మ నటిస్తున్న బాలీవుడ్‌ లేటెస్ట్‌ మూవీ ‘ది కేరళ స్టోరీ’. తాజాగా ఆ మూవీ చిక్కుల్లో పడింది. ఇటీవల విడుదలైన టీజర్‌లో అదా చెప్పిన ఓ డైలాగ్‌ కేరళనాట ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. కేరళ వాసుల ఈ మూవీపై తీవ్ర వ్యతీరేకత వస్తోంది. అసలు సంగతేంటంటే.. ఆదా శర్మ ప్రధాన పాత్రలో ది కేరళ స్టోరీ రూపొందుతుంది. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అదా అపహరణ గురై బలవంతపు మత మార్పిడికి గురైన షాలిని ఉన్ని కృష్ణన్‌ అనే యువతి పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ టీజర్‌లో అదా బుర్ఖ ధరించి కనిపించింది.

చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్‌ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్‌

ఇందులో అదా మాట్లాడుతూ.. ‘ఆమె నర్సు కావాలని కలలు కనేది. కానీ కిడ్నాప్‌కి గురవుతుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్‌లోని జైలులో ఉగ్రవాదిగా ఉంది’ అంటూ తన కథ చెబుతూ కన్నీటీ పర్యంతరం అవుతుంది. అంతేకాదు తను మాత్రమే కాదని తనలాంటి మరో 32 వేల మంది కేరళ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి విదేశాలకు పంపించి ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారంటూ అదా చెప్పుకొచ్చింది. దీంతో టీజర్‌లో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు కేరళనాట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ అంశంపై కొందరు అభ్యంతరం తెలుపుతూ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సినిమాను వెంటనే ఆపేయాలని, తప్పుడు లెక్కలతో కేరళ యువతుల పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్న ఈ మూవీ టీంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చదవండి: ఆసక్తిగా గీతూ రాయల్‌ పారితోషికం.. 9 వారాలకు ఎంత ముట్టిందంటే!

దీంతో ఆ రాష్ట్ర డీజీపీ అనిల్‌ కాంత్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉంటే కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానంద గతంలో ఇచ్చిన ఓ ప్రసంగాన్ని తప్పుగా సబ్ టైటిల్స్ వేసి చూపిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా  ఈ సనిమా సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాను పుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మిస్తున్నారు. కేరళలో అపహరణకు గురైన 32వేల మంది (యూనిట్‌ పేర్కొన్న లెక్క) మహిళల మత మార్పిడి, ఉగ్రవాదులుగా మార్చడం తదితర అంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. 

మరిన్ని వార్తలు