Raj Kundra: రాజ్‌ కుంద్రా, శిల్పా శెట్టిపై చీటింగ్‌ కేసు నమోదు

14 Nov, 2021 13:58 IST|Sakshi

FIR Registered Against Shilpa Shetty And Raj Kundra: బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా మరో కేసులో చిక్కుకున్నారు.అడల్ట్‌ వీడియోల చిత్రీకరణ కేసులో అరెస్ట్‌ అయిన రాజ్‌కుంద్రాకు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా తాజాగా అతనిపై రూ. 1.51 కోట్లు మోసం చేశాడని మరో కేసు నమోదైంది. కుంద్రాతో పాటు శిల్పా శెట్టి, మరికొంత మందిపై ఓ వ్యాపార వేత్త చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపినట్లు సమాచారం. వ్యాపార వేత్త నితిన్‌ బరాయి ఫిర్యాదు మేరకు వారిపై ముంబైలోని బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

ఎఫ్‌ఐఆర్ ప్రకారం, జులై 2014లో ఎస్‌ఎఫ్‌ఎల్‌ ఫిట్‌నెస్‌ కంపెనీ డైరెక్టర్‌ కాషీఫ్‌ ఖాన్‌, శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రా, ఇతరులతో కలిసి లాభం పొందడానికి ఈ ఎంటర్‌ప్రైజ్‌లో రూ. 1.51 కోట్లు పెట్టుబడి పెట్టాలని అడిగినట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఎస్‌ఎఫ్‌ఎల్‌ ఫిట్‌నెస్‌ కంపెనీ తనకు ఫ్రాంచైజీ ఇస్తుందని, పూణెలోని హడప్సర్, కోరేగావ్‌లలో జిమ్‌, స్పాను తెరుస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల‍్చలేదని నితిన్‌ బరాయి పేర్కొన్నారు. తర్వాత నితిన్‌ బరాయి తిరిగి తన డబ్బు అడిగితే బెదిరించినట్లు ఫిర్యాదులో ఉన్నట్లు ఓ పోలీసు అధికారి ఉటంకించారు. 

బాంద్రా పోలీస్ స్టేషన్‌లో రాజ్‌ కుంద్రా దంపతులపై సెక్షన‍్లు 420 (మోసం), 120-బి (నేరపూరిత కుట్ర), 506 (నేరపూరిత బెదిరింపు), 34 (సాధారణ ఉద‍్దేశ్యం)తో పాటు పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని సమాచారం. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు అధికారి తెలిపారు. 

మరిన్ని వార్తలు