ఫిలింనగర్‌ షూటింగ్‌ సెట్‌లో అగ్ని ప్రమాదం

12 Aug, 2021 10:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఓ సినిమా షూటింగ్‌లో సెట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో జరుగుతున్న షూటింగ్‌కు సంబంధించిన కారు జనరేటర్‌ నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జనరేటర్‌ నుంచి డీజిల్‌ లీక్‌ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆ జనరేటర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి పక్కన ఉన్న షాపులకు, మరో కారు ఈ మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో హొండా ఐ20 కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం భారీ జరిగినట్లు తెలుస్తుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు