Rakul Preet Singh: హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బిల్డింగ్‌లో మంటలు

20 Nov, 2021 18:36 IST|Sakshi

Fire Breaks Out At Rakul Preet Singh Building: టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నివాసం ఉండే భవనంలో మంటలు చెలరేగాయి. ముంబైలోని ఈ బిల్డింగ్‌లో 12వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో రకుల్‌ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా మంటలు రాజుకోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు.

ఇదిలా వుంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ సీక్రెట్‌గా లవ్‌లో ఉన్న ఈ భామ తన ప్రేమ విషయాన్ని బర్త్‌డే రోజున అధికారికంగా ప్రకటించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. జాకీ ఈ ఏడాది తనకు దక్కిన పెద్ద బహుమతిగా పేర్కొంది.

చదవండి: షణ్ముఖ్‌తో కనెక్షన్‌పై సిరిని నిలదీసిన నాగార్జున

మరిన్ని వార్తలు