మదర్‌ సెంటిమెంట్‌తో స‌దా `నంద‌`

25 Jul, 2023 01:15 IST|Sakshi

సదా హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నంద’. గోణుగుంట్ల విజయ్‌ కుమార్‌ సమర్పణలో కళ్యాణ్‌ ఎర్రగుంట్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర క‌థానాయ‌కుడు, ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ..‘నేను హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో `నంద‌` చిత్రాన్ని డైర‌క్ట్ చేస్తున్నా. మ‌ద‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ చిత్ర‌మిది.

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా తెర‌కెక్కిస్తున్నాం. ప్ర‌స్తుతం మా చిత్రం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. చ‌ర‌ణ్ అర్జున్ మా చిత్రానికి నాలుగు అద్భుత‌మైన పాట‌లు స‌మ‌కూర్చారు. త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తాం ` అన్నారు. ఈ చిత్రానికి డిఓపీః జైపాల్ రెడ్డి నిమ్మ‌ల‌; సంగీతంః చ‌ర‌ణ్ అర్జున్‌.

మరిన్ని వార్తలు