Keerthy Suresh : 'దసరా' నుంచి కీర్తి సురేష్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

17 Oct, 2022 12:29 IST|Sakshi

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దసరా. ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. నేడు(సోమవారం)కీర్తి సురేష్‌ బర్త్‌డే సందర్భంగా మూవీ యూనిట్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె వెన్నెల పాత్రలో నటిస్తుంది. ఇక ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో కీర్తి పెళ్లికూతురు గెటప్‌లో మాస్‌ లుక్‌తో కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, సముద్ర ఖని, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉంది. 
 

మరిన్ని వార్తలు