ఓ సామాన్యుడి సంతకం

3 Jun, 2023 04:56 IST|Sakshi

‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘నారప్ప’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తర్వాతి చిత్రానికి ‘పెదకాపు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో విరాట్‌ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. మిర్యాల సత్యనారాయణ సమర్పణలో మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఇది.

ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌పై ‘పెదకాపు 1’ అని ఉంది. సో... ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పోస్టర్‌పై ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్‌లైన్‌ ఉంది. ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్‌.

మరిన్ని వార్తలు