కాత్తు వాక్కుల రెండు కాదల్‌: సమంత ఫస్ట్‌లుక్‌ చూశారా?

16 Nov, 2021 08:41 IST|Sakshi

First Look Of Samantha In Kaathuvaakula Rendu Kaadhal Out: కాత్తు వాక్కుల రెండు కాదల్‌ చిత్ర ఫస్ట్‌ పోస్టర్‌ను నిర్మాతలు సోమవారం విడుదల చేశారు. విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. దీనికి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. దీన్ని నయనతార, విఘ్నేష్‌ శివన్‌ల రౌడీ పిక్చర్స్‌ సంస్థ, లలిత్‌ కుమార్‌కు చెందిన 7 స్క్రీన్స్‌ స్టూడియోస్‌ సంస్థ సంయుక్తంగా నిర్మించారు. అనిరుద్‌ సంగీతాన్ని అందించిన చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై సంగీత ప్రియుల ఆదరణ పొందుతున్నాయి.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ల విడుదలతో నిర్మాతలు ప్రచారం ప్రారంభించారు. విజయ్‌ సేతుపతి మూడు ముఖాలతో కూడిన ఒక పోస్టర్‌ను, నటి సమంత ఫొటోతో మరో పోస్టర్‌ను ఒకేసారి విడుదల చేసి చిత్రంపై ఆసక్తిని రేకెత్తించే యత్నం చేశారు. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రసారం ఇటీవల జోరుగా సాగింది. దానికి చెక్‌ పెట్టే విధంగా తమ చిత్రం థియేటర్లోనే విడుదలవుతుంది యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

మరిన్ని వార్తలు