డెవిల్స్‌ ఏంజిల్‌

12 Sep, 2023 04:02 IST|Sakshi

కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డెవిల్‌’. దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌. సోమవారం (సెప్టెంబర్‌ 11) ఆమె పుట్టినరోజు.

ఈ సందర్భంగా ‘డెవిల్‌’ చిత్రంలో సంయుక్త పోషించిన నైషధ పాత్ర ఫస్ట్‌ లుక్‌పోస్టర్‌ను ‘డెవిల్స్‌ ఏంజిల్‌’ అంటూ మేకర్స్‌ విడుదల చేశారు. ‘‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నవంబర్‌ 24న విడుదల చేస్తాం’’ అన్నారు అభిషేక్‌ నామా.

మరిన్ని వార్తలు