అందాలు చదివే కళ్లకైనా...

16 Sep, 2023 02:21 IST|Sakshi
పంఖురి,నవదీప్‌

నవదీప్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లవ్‌ మౌళి’. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పంఖురి గిద్వానీ, మిర్చి హేమంత్‌ నటించారు. ప్రశాంత్‌ రెడ్డి తాటికొండ నిర్మాత.

గోవింద్‌ వసంత సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అందాలు చదివే కళ్లౖకైనా.. కందాలు తిరిగే కాళ్లకైనా.. వందేళ్లు కదిలే గుండెకైనా..’ అంటూ సాగే పాటని రిలీజ్‌ చేశారు. అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను అనిల్‌ కష్ణన్  పాడారు. ‘‘లవ్‌ మౌళి’ షూటింగ్‌ మొత్తం మేఘాలయలోని చిరపుంజీలో చిత్రీకరించాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు