‘మాయదారి మైసమ్మ’ గాయకుడు మృతి 

24 Dec, 2020 08:34 IST|Sakshi

కంటోన్మెంట్‌: మాయదారి మైసమ్మ, కోడిపాయె లచ్చమ్మ అంటూ మూడు దశాబ్దాలుగా శ్రోతలను ఉర్రూతలూగించిన గేయ రచయిత, గాయకుడు పోతరాజు నర్సయ్య (పీఎన్‌) లింగరాజ్‌ (66) బుధవారం కన్నుమూశారు. బొల్లారం ఆదర్శనగర్‌లో ఉండే లింగరాజ్‌.. స్థానిక మిత్రులతో కలసి డిస్కో రికార్డింగ్‌ కంపెనీ (డీఆర్‌సీ) పేరిట ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1980 నుంచి పాటలు రాసి, పాడుతున్న ఈ బృందం ఆధ్వర్యంలో వందలాది జానపాద గేయాలు ప్రాణం పోసుకున్నాయి.

ఆయా పాటల రచన, గాత్రంలో లింగరాజ్‌ది ప్రత్యేక స్థానం. వెయ్యికి పైగా పాటలు రాసి, పాడిన లింగరాజ్‌కు 1987లో పాడిన ‘మాయదారి మైసమ్మ’పాట జాతీయ స్థాయిలో గుర్తింపు తెచి్చంది. అయ్యప్ప భజన పాటలు కూడా రాసి పాడారు. ఆదర్శ్‌నగర్‌ బస్తీ కమిటీలో సభ్యుడైన లింగరాజ్‌ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనే వారు. ఆయనకు భార్య ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. బుధవారం ఉదయం మృతి చెందిన లింగరాజ్‌ అంత్యక్రియలు సాయంత్రం ముగిశాయి.

ప్రఖ్యాత చిత్రకారుడు బాతిక్‌ బాలయ్య మృతి 
సాక్షి, సిద్దిపేట: ప్రఖ్యాత చిత్రకారుడు బాతిక్‌ (యాసాల) బాలయ్య (82) బుధవారం తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్‌ గ్రామంలో యాసాల దుర్గయ్య, విశాలాక్ష్మి దంపతులకు 1939 ఆగస్టు 25న  జన్మించారు. ఓయూ నుంచి ఎంఏ, బీఈ డీ పట్టాపొందిన ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఇటు చిత్రాలను గీయడం అలవాటుగా చేసుకున్నారు. ఆయన గీసిన∙చిత్రాలను చూసిన మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాల్‌ శర్మ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎంతో అభినందించారు.

వారి చేతుల మీదుగానే అ వార్డులు అందుకున్నారు. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న బాలయ్య తెలంగాణ ఉద్యమ కాలంలో తన చిత్రాల ద్వారా ఉద్యమానికి మద్దతు తెలిపారు. బాలయ్య విదేశాల్లో ప్రదర్శనలిచ్చి ఎన్నో ప్రశంసలూ పొందారు. బాలయ్య మృతి పట్ల ఆర్థికమంత్రి హరీశ్‌రావు, సాహిత్య అకాడ మీ మాజీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు