నాలుగేళ్లుగా డేటింగ్‌: పెళ్లి జరగదంటున్న నటుడు

2 Jun, 2021 19:26 IST|Sakshi

'ఫ్రెండ్స్‌: ద రీయూనియన్‌' స్టార్‌ మాథ్యూ పెర్రీ తన ప్రేయసి మోలీ హర్విట్జ్‌తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరగవని, అందులో ఈ పెళ్లి కూడా ఒకటని పేర్కొన్నాడు. మోలీకి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. 51 ఏళ్ల వయసున్న నటుడు ఈ మధ్యే వచ్చిన 'ఫ్రెండ్స్‌: ద రీయూనియన్‌' వెబ్‌సిరీస్‌లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇతడు 2018 నుంచి 29 ఏళ్ల మోలీతో డేటింగ్‌లో ఉన్నాడు.

ఈ క్రమంలో 2019లో వీళ్లిద్దరూ హాలీడేస్‌ను బాగా ఎంజాయ్‌ చేశారు. తను మోలీని పెళ్లి చేసుకోబోతున్నానని, త్వరలోనే ఎంగేజ్‌మెంట్‌ కూడా జరగనున్నట్లు గతేడాది నవంబర్‌లో మీడియాకు వెల్లడించాడు. కానీ అంతలోనే నిశ్చితార్థం జరగడం లేదని చెప్తూ అభిమానులకు షాకిచ్చాడు. కాగా మాథ్యూ గతంలో లిజ్జీ కాప్లాన్‌తో ఆరేళ్ల పాటు ప్రేమాయణం నడిపాడు. వీరిద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో 2012లో విడిపోయారు.

చదవండి: OTT: నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌ లిస్ట్‌ ఇదిగో!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు