FriendShip Day 2021: దోస్తానాపై వచ్చిన తెలుగు చిత్రాలు

1 Aug, 2021 09:49 IST|Sakshi

అమ్మ మీద అంతులేని ప్రేమ ఉన్నా…అన్ని విషయాలు మాట్లాడలేం. నాన్నంటే ఎంత గౌరవం ఉన్నా…అన్నింటినీ షేర్‌ చేసుకోలేం. జీవిత భాగస్వామి మనలో సగమే అయినా…ఏదో ఒక సీక్రెట్ దాచే ఉంచుతాం. మరి…ఒక మనిషి ఎలాంటి రహస్యాలు లేకుండా, ఓపెన్‌గా ఉండేది ఎక్కడ ? ప్రేమ, గౌరవం, వినయం, బాధ్యత లాంటి భావోద్వేగాలను కూడా దాటుకుని నిలబడేది ఎవరి పక్కన ? ఒక్క స్నేహితుడి దగ్గరే. సాధారణ మనిషికైనా.. స్టార్‌ హీరోకైనా స్నేహితులు ఉండాల్సిందే. స్నేహానికి ధనిక, పేద తేడాలే కాదు…లింగ భేదాలు కూడా ఉండవు.. ‘ఫ్రెండ్‌షిప్ డే’ సందర్భంగా టాలీవుడ్‌లో వచ్చిన కొన్ని ఫ్రెండ్‌షిప్ మూవీస్ మీ కోసం..


స్నేహం కోసం
చిరంజీవి, విజయ్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘స్నేహం కోసం’ సినిమా స్నేహ బంధాన్ని చాటి చెప్పింది. ఈ సినిమాకు గానూ మెగాస్టార్ చిరంజీవికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ అవార్డును తెచ్చిపెట్టింది. స్నేహానికి ఆస్తులు అంతస్థులు, ధనిక, పేద, కుల,మత బేధాలేవి ఉండవని చాటి చెప్పింది.  ' మీసం ఉన్న నేస్తమా.. నీకు కోపం ఎక్కువ' అనే పాట స్నేహితుడు ఎలాంటి వాడో చెపుతుంది.



స్నేహమంటే ఇదేరా
ఈ చిత్రం స్నేహ బంధంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇందులో నాగార్జున, సుమంత్‌ స్నేహితులుగా నటించారు. భూమిక చావ్లా, ప్రత్యూష హీరోయిన్లుగా నటించారు. 



వసంతం
వెంకటేశ్, కళ్యాణి, ఆర్తి అగర్వాల్, ఆకాశ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం వసంతం.  2003లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయింది. ఇందులో వెంకటేశ్, కల్యాణి స్నేహితులుగా నటించారు. స్నేహానికి లింగభేదం ఉండదని ఈ సినిమా చాటి చెప్పింది. ఈ సినిమాలోని 'గాలి చిరుగాలి.. ఈ సినిమాలోని 'గాలి చిరుగాలి.. నిను పిలిచిందెవరమ్మా) అనే పాట బాధలో ఉండే స్నేహితుడిగా మనోధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది.



ఓ మై ఫ్రెండ్
సిద్ధార్థ్, శృతి హాసన్, హన్సిక, నవదీప్ ప్రధాన పాత్రలుగా 'ఓ మై ఫ్రెండ్' అనే సినిమా 2011లో వచ్చింది. సినిమాలో చందు, సిరి అనే అమ్మాయి, అబ్బాయి మధ్య ఓ మంచి స్నేహాన్ని ఈ సినిమాలో చూపించారు.



హ్యాపీడేస్‌
వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, సోనియా తదితరులు ప్రధాన పాత్రలు శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం 'హ్యాపీడేస్‌'. కాలేజ్ డేస్ లో పరిచయమయ్యే స్నేహాలు, వారి నుంచి లభించే స్వీట్ మెమొరీస్ ని బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో స్నేహితుల్లో ఉండే రకాలందరినీ చూపించారు.

ఈ మధ్యకాలంలో వచ్చిన ఉత్తమ స్నేహ చిత్రంగా రామ్ హీరోగా నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’, మహేశ్‌ బాబు ‘మహర్షి’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వీటితో పాటు నీ స్నేహం, కేరింత, ఆర్య2 లాంటి చిత్రాలు కూడా స్నేహబంధాన్ని చక్కగా చాటిచెప్పాయి.

మరిన్ని వార్తలు