యాంకర్‌ రవిపై ఫన్‌ బకెట్‌ జస్విక ఆసక్తికర వ్యాఖ్యలు

2 Jun, 2021 20:38 IST|Sakshi

ఫన్‌ బకెట్‌ జూనియర్‌ ఫేం జస్విక, యంకర్‌ రవి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. యూట్యూబ్, టిక్ టాక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న జస్విక మంగళవారం లైవ్‌ చిట్‌చాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ యాంకర్‌ రవి గురించి చెప్పమని, ఆయనపై మీ అభిప్రాయం ఎంటని అడిగాడు. దీనిపై జస్విక స్పందిస్తూ.. ‘రవి అన్న యూనిక్‌గా ఉంటారు. సెట్‌లో ప్రతీ ఒక్క విషయాన్ని ఆయన ఎంతో బాగా హ్యాండిల్ చేస్తారు.  అందరితో ఫన్నీగా మాట్లాడుతూ సెట్‌ వాతావరణాన్ని సరదాగా మారుస్తారు.

ఆయన ఒక గొప్ప మెంటర్. ఆయనతో కలిసి పని చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. రవి అన్న నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయనకు ఉన్న నాలెడ్జ్ అనంతమైంది. ఎంతో స్ఫూర్తివంతమైన వ్యక్తి’ అంటూ జస్విక చెప్పుకొచ్చింది. అంతేగాక రవి అన్నను ఓ షోలో మొదటి సారి చూసినప్పుడు ఆయన ఎనర్జీ చూసి షాక్‌ అయ్యానని, ఆ షో అంతా కళ్లు తిప్పుకోకుండా అన్ననే చూస్తూ ఉండిపోయాను అని చెప్పింది. ఇక ఆయన ప్రతీ ఒక్కరినీ పలకరించే విధానం, తోటి ఆర్టిస్టుల పట్ల ఆయన చూపించే అభిమానం నన్ను ఎంతో ఆకట్టుకుందని తెలిపింది. ఇక తన గురించి జస్విక చెప్పిన మాటలకు రవి ఫిదా అయిపోయాడు. ‘నా గురించి ఇంత బాగా చెప్పినందుకు థ్యాంక్యూ జస్విక, నువ్వు ఎంతో స్వీట్.. మళ్లీ మనం సెట్‌ మీద కలిసి పనిచేసే సమయం కోసం ఎదురుచూస్తుంటాను’ అంటు రవి ఎమోషనల్‌ అయ్యాడు. 

మరిన్ని వార్తలు