‘జూనియర్‌’గా వస్తున్న గాలి జనార్దన్‌ రెడ్డి తనయుడు

1 Oct, 2022 15:49 IST|Sakshi

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి సినిమాల్లోకి  ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన హీరోగా దర్శకుడు రాధాకృష్ణ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జెనీలియా ఓ కీలక పాత్ర పోషించబోతుంది. వారాహి చలన చిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించారు మేకర్స్‌.  ఈచిత్రానికి ‘జూనియర్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

కిరిటీ బర్త్‌డేని పురస్కరించుకొని శుక్రవారం సినిమా టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ని విడుదల చేశారు. ‘చిన్నప్పటి నుంచి మనం ఏదో ఒకటి అయిపోదాం అనుకుంటాం. మనం అవ్వకపోయినా జీవితం ఏదో ఒకటి చేసేస్తుంది..’అంటూ సాగే ఈ వీడియో గ్లింప్స్‌ అందరిని ఆకట్టుకుంటుంది.  ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం, సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు