‘జస్టిస్‌ లీగ్‌’ డైరెక్టర్‌ నన్ను బెదిరించాడు: వండర్‌ వుమెన్‌

21 Oct, 2021 10:42 IST|Sakshi

డీసీ సినిమాటిక్‌ యూనివర్స్‌ మూవీ ‘వండర్‌ వుమెన్‌’తో హాలీవుడ్‌ నటి గాల్‌ గాడెట్‌ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆ సినిమా సమయంలో ఈ బ్యూటీకి ఎదురైన చేదు అనుభవాలన తాజాగా ఓ ఇంటర్వూలో వెల్లడించింది.

డీసీ సూపర్‌ హీరో మూవీ ‘జస్టిస్‌ లీగ్‌’కి మొదట హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ జాక్ స్నైడర్ దర్శకత్వం వహించాడు. అనంతరం వివిధ కారణాలతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆయన ప్లేస్‌లో ఫిల్మ్ మేకర్ జాస్ వెడాన్ దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. కొత్తగా వచ్చిన ఈ దర్శకుడు సినిమా షూటింగ్‌లో ఉండగా తన కెరీర్‌ గురించి బెదిరించాడని నటి గాల్‌ గాడెట్‌ తెలిపింది. ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదని, అయితే మూవీ ప్రొడ్యూసర్స్‌ అయితే వార్నర్‌ బ్రదర్స్‌ నాకు అభయం ఇచ్చారని చెప్పింది.

గాల్‌ గాడెట్‌ డైరెక్టర్‌ వెడాన్‌పై ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. అతను ఎంతో మందితో డిఫరెంట్‌గా బిహేవ్‌ చేసేవాడని.. గతంలో సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టులు పెట్టింది. కాగా ఈ బ్యూటీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్, జస్టిస్ లీగ్, క్రిమినల్, కీపింగ్ అప్ విత్ ది జోన్స్, బాట్‌మ్యాన్ వర్సెస్‌ సూపర్‌ మ్యాన్‌: డాన్ ఆఫ్ జస్టిస్ వంటి చిత్రాల్లో నటించింది.

చదవండి: పిక్‌ని పోస్ట్‌ చేసిన ‘స్పైడర్‌ మ్యాన్‌’.. ఎమోషనల్‌ అయిన ప్రియురాలు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు