పవన్‌ చేతుల మీదుగా ‘గమనం’ ట్రైలర్‌

11 Nov, 2020 10:19 IST|Sakshi

దర్శకుడు సుజనారావు తెరకెక్కిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘గమనం’. మొత్తం అయిదు భాషల్లో(తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ) రూపొందుతున్న ఈ సినిమాలో శ్రియ శరణ్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టుర్లు గమనంపై అంచనాలను మరింత పెంచాయి. తాజాగా గమనం సినిమా తెలుగు ట్రైలర్‌ను ఈ రోజు(బుధవారం)  ఉదయం 09.09 గంటలకు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌తో కలిసి ట్రైలర్‌ను వీక్షించారు. ఇక మూడు విభిన్న కథలతో తెరకెక్కిన ‘గమనం’ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. చెవిటి యువతిగా చంటిబిడ్డతో శ్రియ పడే కష్టాలు, క్రికెటర్‌ కావాలనుకునే ఓయువకుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ముస్లిం యువతి, రోడ్డుపై చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరు అనాథ పిల్లల జీవితం.. ఇలా మూడు కథలతో గమనం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. చదవండి: ‘గమనం’ నుంచి నిత్య ఫస్ట్‌ లుక్...‌

మొత్తం అయిదుభాషల్లో ఈ సినిమా రూపొందుతుండటంతో  ట్రైలర్‌ను కూడా అయిదు భాషల్లో విడుదల చేశారు. ఇందులో భాగంగా తెలుగు ట్రైలర్‌ను పవన్‌ విడుదల చేశారు. హిందీలో సోనూసూద్‌, తమిళ్‌లో జయం రవి, కన్నడలో శివరాజ్‌ కుమార్‌, మలయాలళంలో ఫహద్‌ ఫసిల్‌ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. కాగా గమనంలో నిత్యామీనన్‌ కర్ణాటక గాయకురాలు శైలపుత్రీ దేవి పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్‌ బుర్రా మాటలు సమకూర్తుండగా.. జ్ఞాన శేఖర్‌ వీఎస్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. రమేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పుల‌తో క‌లిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉంది. చదవండి: ఆ విషయం తెలిసి విస్తుపోయాం: పవన్‌
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా