పాన్‌ ఇండియా స్థాయిలో ‘1948 - అఖండ భారత్’

2 Oct, 2021 15:24 IST|Sakshi

మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి గల కారణం ఏంటి? హత్య తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘1948 - అఖండ భారత్’. ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎంవై మహర్షి నిర్మిస్తున్న ఈ చిత్రంలో  ఆలేఖ్య శెట్టి, రఘనందన్, ఆర్యవర్ధన్ రాజ్, ఇంతియాజ్  తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌ని గాంధీ జయంతి సందర్భంగా శనివారం విడుదల చేశారు. సుమారు 92 ముఖ్య పాత్రలతో భారీగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు నిర్మాత ఎం.వై.మహర్షి తెలిపారు.

ఈ సందర్భంగా రీసెర్చ్ డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్‌ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి... హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని, వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నామని చెప్పారు. 70 సంవత్సరాల పాటు దాచి పెట్టబడిన నిజాలను... ప్రామాణికంగా పరిశోధన చేసి ఈ సినిమాకి స్క్రిప్ట్ ని సిద్ధం చేశామన్నారు. ఈ చిత్రానికి ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే -మాటలు - రీసెర్చ్: డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్, సంగీతం:  శశిప్రీతమ్‌.

మరిన్ని వార్తలు