గాంధీ జయంతి సందర్భంగా ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చిన విజయ్‌

2 Oct, 2023 06:34 IST|Sakshi

గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి నగరం, ఊరు వాడల్లోని గాంధీ మహాత్ముని శిలా విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవ వందనం సమర్పించాలని నటుడు విజయ్‌ తన సంఘం కార్య నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని విజయ్‌ ప్రజా సంఘం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

అందులో మన ప్రజాసంఘం అధ్యక్షుడు విజయ్‌ ఆదేశాల మేరకు తమిళనాడులోని అన్ని జిల్లాల్లోనూ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సంఘం నిర్వాహకులు కార్యకర్తలు వారివారి ఊళ్లలోని గాంధీ మహాత్ముడి విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవ వందనం చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా తమ జిల్లాల్లోని స్వతంత్య్రం కోసం పాటుపడ్డ జాగుల జిల్లాకు వెళ్లి వారిని సత్కరించాలని పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: రతిక ఎలిమినేట్.. 'బిగ్‌బాస్'లో రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే!)

ఈ కార్యక్రమంలో జిల్లాల అధ్యక్షులు, యువభాగం అధ్యక్షులు, నిర్వాహకులు, అందరూ పాల్గొని సమైక్యంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయా కార్యక్రమాలకు సంబంధించిన పెండేసి ఫొటోలను తమ సంఘం కార్యాలయానికి ఈ మెయిల్‌ ద్వారా పంపించాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు