GARUD: ఆఫ్ఘ‌నిస్థాన్ రెస్క్యూ ఆప‌రేష‌న్‌ ఆధారంగా బాలీవుడ్‌ మూవీ

15 Sep, 2021 15:24 IST|Sakshi

ఆఫ్గానిస్తాన్‌ని తాలిబన్లు పూర్తి స్థాయిలో ఆక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో ఎన్నో దేశాలు అక్కడ రెస్క్యూ ఆప‌రేష‌న్‌ నిర్వహించి తమ పౌరులను విమానాల్లో తరలించాయి. ఇండియా సైతం భారతీయులతోపాటు ఎంతోమంది ఆఫ్గానీయులను  రెస్క్యూ చేసి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్‌ ఆధారంగా బాలీవుడ్‌లో ‘గరుడ్‌’ పేరుతో సినిమా తెరక్కెనుంది.

జాన్‌ అబ్రహం హీరోగా ‘ఎటాక్‌’ సినిమా నిర్మాత అజయ్‌కపూర్‌ ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఈ విషయాన్ని ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్విట‌ర్‌ ద్వారా తెలిపాడు. చిత్ర మోషన్‌ పోస్టర్‌ని బుధవారం (సెప్టెంబర్‌ 15న) విడుదల చేశాడు. ఈ మూవీకి మరో నిర్మాతగా సుభాష్‌ కాలే వ్యవహరించనున్నారు. ఈ సినిమా డైరెక్ట‌ర్‌, న‌టీన‌టుల, ఇతర క్యాస్టింగ్‌ ఫైనలైజ్‌ కాలేదని, ఆ వివ‌రాలు త్వరలోనే చెబుతామని ఆయన వెల్లడించాడు. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప్ర‌త్యేక వింగ్‌ గ‌రుడ్ క‌మాండో ఫోర్స్‌లోని ఓ అధికారి చుట్టూ ఈ క‌థ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి సుభాష్‌ కాలే కథ అందిస్తుండగా, కేజీఎఫ్‌ సినిమాలకు పనిచేసిన రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. 

ఈ మూవీ వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు. కాగా జాన్‌ అబ్రహం కథనాయకుడిగా నటిస్తున్న ఎటాక్‌ సినిమాని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో కాకుండా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు మూవీ టీం ఇటీవల ప్రకటించింది.

మరిన్ని వార్తలు